![]() |
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -348 లో.....ఆఫీస్ బాయ్ దొరికాడా అని వీరు రౌడీ లని అడుగుతాడు. లేదని వాళ్ళు చెప్తారు. వాళ్ళతో మాట్లాడడం రుద్ర చూస్తాడు. ఎవరు వాళ్ళు అని అడుగుతాడు. చందా కోసం వచ్చారని వీరు కవర్ చేస్తాడు. దాంతో రుద్రకి డౌట్ వచ్చి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తాడు. మరొకవైపు విశ్వ ఇంటికి కొరియర్ వస్తుంది. అది చూసి నాన్న నాకోసం ఏదైనా సర్ ప్రైజ్ ప్లాన్ చేసి గిఫ్ట్ ఆర్డర్ పెట్టాడేమో అని జయ అంటుంది.
ఇక అప్పుడే విశ్వ వస్తాడు. ఇది ఎవరి అండి మన జయ కోసం ఏమైనా ఆర్డర్ చేశారా అని సుధా అడుగగా.. అవునవి జయ కోసమే అని విశ్వ అంటాడు. తీరా పార్శిల్ ఓపెన్ చేసి చూస్తే అందులో బాక్సింగ్ గ్లౌజ్ అండ్ డ్రెస్ అండ్ బాక్సింగ్ కి సంబందించిన వస్తువులు ఉంటాయి. అవి చూసి జయ షాక్ అవుతుంది. అమ్మాయి అంటే ఇలాంటి పోటీలకి పనికి రాదని అనుకున్నాను కానీ గంగని చూసి నా ఆలోచన మార్చుకున్నానని విశ్వ అంటాడు ఈ గ్లౌసెస్ వేసుకొని ప్రాక్టీస్ కి రెడీ అవ్వమని విశ్వ చెప్తాడు. దాంతో జయ లోపలికి వెళ్లి వీరుకి ఫోన్ చేస్తుంది. అసలు ఇదంతా ఏంటి మీరు చెప్పిందల్లా చేస్తున్న నాకేంటి ఇది అని కోప్పడుతుంది. ఇప్పుడు నువ్వు బాక్సింగ్ నేర్చుకోవడం కూడా మన మంచికే అని వీరు చెప్తాడు.
ఇప్పుడు బాగా ప్రాక్టీస్ అయి విన్ అయితే అందరి దృష్టిలో గంగ కంటే నీకు ఇంపార్టెన్స్ పెరుగుతుందని వీరు చెప్పగానే జయ సరే అంటుంది. ఆ తర్వాత జయ రెడీ అయి కిందకి వస్తుంది. అప్పుడే విశ్వకి ఫోన్ వచ్చి బయటకు వెళ్తాడు. బేసిక్స్ కదా గంగ నేర్పిస్తుందని రుద్ర అంటాడు. అలా నేర్పించే క్రమం లో జయపై గంగ రివెంజ్ తీర్చుకుంటుంది. తనని కొడుతుంది ఈ రోజుకి ఇది చాలని గంగతో రుద్ర అంటాడు. నా చెల్లి దెబ్బలకి వేడినీళ్ళ కాపాడం పెట్టుకోవాలని రంగా అనగానే జయకి కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jayam serial Telugu, Zee Telugu serial updates, Jayam episode highlights, Telugu serial news, Jayam cast and crew.
![]() |